చందా కొచ్చార్ రాజీనామా

Thu,October 4, 2018 02:27 PM

Chanda Kochhar quits ICICI Bank

ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్ చందా కొచ్చార్ రాజీనామా చేశారు. బ్యాంక్ బోర్డు ఆమె రాజీనామాను అంగీకరించింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని కొచ్చార్.. బ్యాంక్ బోర్డును కోరింది. దానికి తగినట్లుగానే ఆమెకు అనుమతి లభించింది. రాజీనామా చేసిన చందా కొచ్చార్ స్థానంలో బ్యాంక్ నూతన డైరక్టర్‌గా సందీప్ భక్షిని నియమించారు. 2023, అక్టోబర్ 3 వరకు సందీప్ ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

బ్యాంక్ నియమావళిని ఉల్లంఘించిన కేసులో చందా కొచ్చార్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ విచారిస్తున్న విష‌యం తెలిసిందే. దీని కోసం బ్యాంక్ బోర్డు.. ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ఇండియాలో ఐసీఐసీఐ మూడవ అతిపెద్ద బ్యాంక్. ఎండీగా ఆమె తీసుకున్న నిర్ణయాలు.. బ్యాంక్ పర్ఫార్మెన్స్‌పై ఏమైనా ప్రభావం చూపాయా అన్న కోణంలో విచారణ సాగుతుందని బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో చందా కొచ్చార్‌కు సమన్లు జారీ చేశారు.

1301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles