కొచ్చర్ వార్షిక లీవు తీసుకుంది: ఐసీఐసీఐ

Fri,June 1, 2018 12:07 PM

చెన్నై: ఎండీ, సీఈవో చందా కొచ్చర్ వార్షిక సెలవు తీసుకున్నట్లు ఇవాళ ఐసీఐసీ బ్యాంక్ స్పష్టం చేసింది. కొచ్చర్‌ను లీవ్ మీద వెళ్లాల్సిందిగా ఆమెను కోరలేదని బ్యాంక్ వెల్లడించింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే, చందా కొచ్చర్ వార్షిక లీవు తీసుకున్నట్లు ఐసీఐసీఐ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఆమెకు వారసులను వెతికేందుకు ఓ కమిటీని నియమించినట్లు వస్తున్న వార్తలను బ్యాంక్ ఖండించింది. కొచ్చర్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను విచారించేందుకు బ్యాంక్ ఓ స్వతంత్ర దర్యాప్తు కమిటీని వేసింది.


క్విడ్‌ప్రోకో సహా ఇతర ఆరోపణలు, పలువురు రుణగ్రహీతలతో కొచ్చర్‌కున్న సంబంధాలపై విచారణ జరుపాలని ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ మంజూరు చేసిన రుణంలో బ్యాంక్ ఎండీ, సీఈవోగా చందా కొచ్చర్ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన నూపవర్ సంస్థలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టారని, దీనికి రుణానికి సంబంధం ఉందని ఓ విజిల్ బ్లోవర్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతీ విదితమే.

ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇక్కడ సమావేశమైన ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. స్వతంత్ర, నమ్మకమైన వ్యక్తితో విచారణ జరుగుతుందని, ఈ మొత్తం వ్యవహారంలో కొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తామన్నది.

1501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles