చందా కొచ్చార్‌ను విచారించిన ఈడీ

Mon,May 13, 2019 05:42 PM

Chanda Kochhar appears before Enforcement Directorate in ICICI Videocon bank loan case

హైద‌రాబాద్: వీడియోకాన్ గ్రూపుకు బ్యాంకు రుణం ఇచ్చిన కేసులో ఇవాళ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజ‌ర్‌, సీఈవో చందా కొచ్చార్‌ను ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. ఇదే కేసులో కొచ్చార్ భ‌ర్త‌ను కూడా ఇవాళ విచారించారు. గ‌తంలో ముంబై అధికారులు వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. చందా కొచ్చార్ మేన‌ల్లుడు రాజీవ్ కొచ్చార్‌ను కూడా ముంబై, ఢిల్లీ న‌గ‌రాల్లో ప్ర‌శ్నించారు. సీబీఐ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఈడీ విచార‌ణ చేస్తున్నారు. చందా కొచ్చార్ భ‌ర్త కంపెనీలో క్విడ్ ప్రోకో ప‌ద్ధ‌తిలో 64 కోట్ల పెట్టుబ‌డి జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలో ఈడీ అధికారులు కొచ్చార్ నివాసంలో సోదాలు కూడా జ‌రిగాయి.

649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles