‘టీ’ తోనే గత 30 ఏళ్లుగా జీవిస్తున్న ‘ఛాయ్ వాలీ చాచీ’

Sat,January 12, 2019 02:55 PM

Chai Wali Chachi Who is Been Living On Tea For Over 30 Years

హైదరాబాద్: టీ అంటే దాదాపుగా అందరూ ఇష్టపడేవారే.. అదే టీ ని బ్రేక్‌ఫాస్ట్‌గా, లంచ్‌గా, డిన్నర్‌గా తీసుకోవడం అంటే కష్టమేమరి. అలా అతిగా సేవించడం ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మహిళ ఇందుకు పూర్తిగా భిన్నం. గత 30 ఏళ్లుగా ఆమె టీ మాత్రమే త్రాగుతూ జీవిస్తోంది. టీ తప్ప మరే ఇతర ఆహార, పానీయాలు తీసుకోదు. అట్లని ఆమె అనారోగ్యంగా ఉందనుకుంటున్నారా? పూర్తిగా ఆరోగ్యవంతురాలిగా ఉంది. స్థానికంగా అందరూ ఆమెను ఛాయ్ వాలీ చాచీ అని పిలుస్తుంటారు. కొరియా జిల్లా బరాదియా గ్రామ మహిళ పిల్లి దేవి(44).. 11 ఏళ్ల వయస్సప్పుడు ఆహారం తీసుకోవడం బంద్ చేసింది. అప్పటినుంచి టీ మాత్రమే తీసుకుంటూ జీవిస్తోంది. దీనిపై ఆమె తండ్రి రతిరాం మాట్లాడుతూ...

ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచే తన కూతురు అన్నం తినడం మానేసింది. జిల్లా స్థాయి టోర్నమెంట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆమె అన్నం తినడం, నీళ్లు త్రాగడం బంద్ చేసింది. మొదట్లో పాలతో తయారు చేసిన టీ లో బిస్కెట్లు, బ్రెడ్ కలుపు తినేది. క్రమంగా ఇవి కూడా తీసుకోవడం మానేసి పూర్తిగా బ్లాక్ టీ వైపు మళ్లింది. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత బ్లాక్ టీ సేవిస్తుంది. మొదట్లో తన ప్రవర్తన పట్ల భయందోళన చెంది వైద్యులకు చూపించాం. వారు అన్ని పరీక్షలు చేసి సమస్యేమి లేదని, ఆరోగ్యవంతంగానే ఉందని చెప్పారు. ఇలా పలువురి డాక్టర్లకు చూపించినా వారు సైతం ఇలాగే చెప్పేవారు. పిల్లి దేవీ ఎప్పుడో కానీ ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టదు. రోజంతా శివారాధానలో ఉంటుంది. జిల్లా ఆస్పత్రి వైద్యుడు డా. ఎస్‌కే గుప్తా ఈ విషయంపై స్పందిస్తూ.. టీ మాత్రమే తీసుకుంటూ బ్రతకడం మానవులకు సాధ్యమయ్యే పనికాదన్నారు. కానీ ఆమె విషయంలో ఇది ఆశ్యర్యానికి గురిచేస్తుందన్నారు.

2568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles