మణిపూర్‌లో యూఎఫ్‌వో కనిపించిందా.. మాకు తెలియదే!

Thu,January 3, 2019 05:04 PM

Centre unaware of UFO sighting in Manipur says Union Minister Jitendra Singh

న్యూఢిల్లీ: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో గతేడాది అక్టోబర్‌లో అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్‌ఓ) కనిపించిందని కొంతమంది యువకులు చెప్పడం సంచలనం సృష్టించింది. మంత్రిపుఖ్రి ప్రాంతంలోని ఓ బాయ్స్ హాస్టల్‌కు చెందిన ఈ యువకులు తాము డిస్క్ ఆకారంలోని వస్తువు ఆకాశంలో ఎగరడం చూశామని చెప్పారు. ఇప్పుడు ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఇదే అంశానికి సంబంధించి రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. సాధారణ ప్రజలు తరచూ ఇలా యూఎఫ్‌ఓలను చూసినట్లు చెబుతుంటారు. అవి ఏవో ఎయిర్‌క్రాఫ్ట్‌లు లేదా మరే ఇతర వస్తువు అయినా కావచ్చు. ప్రస్తుతానికైతే యూఎఫ్‌ఓపై ఇస్రో దగ్గర ఎలాంటి సమాచారం లేదు అని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా యూఎఫ్‌ఓలు కనిపించాయంటూ ఎవరో ఒకరు ఇంటర్నెట్‌లో వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. గతేడాది జులైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం దగ్గరే ఓ యూఎఫ్‌ఓ కనిపించినట్లు వార్తలు రావడం భద్రతా వర్గాలను కలవరపెట్టాయి.

1687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles