బెంగాల్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన కేంద్రం

Sat,June 15, 2019 06:14 PM

Centre Seeks Report From Bengal Government

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. ఎన్నికల సందర్భంగా బంగాల్‌లో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. హింసాత్మక ఘటనల కారకులపై తీసుకున్న చర్యలు చెప్పాలంది. హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదంది. 2016లో 509 ఘటనలు చోటుచేసుకోగా 2018లో అది 1,035కు చేరుకుందని పేర్కొంది. కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే 773 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయంది. మృతుల సంఖ్య ఏటికేడాది పెరుగోందని ఆందోళన వ్యక్తం చేసింది. 2016లో 36 మంది మరణించగా, 2018లో ఆ సంఖ్య 96కు చేరిందన్నారు. ఈ ఏడాది జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 26 మంది మృతిచెందినట్లు పేర్కొంది. శాంతిభద్రతలు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు భావిస్తున్నామంది. వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపింది. హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకోవాలని పేర్కొంది.

2115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles