రఫేల్ వ్యవహారంపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు...

Sat,May 4, 2019 11:51 AM

Centre files fresh affidavits in Rafale review case in SC saying

ఢిల్లీ: రఫేల్ రివ్యూ పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రఫేల్ ఒప్పందంపై సీబీఐ అవసరం లేదని, రివ్యూ పిటిషన్‌లను కొట్టివేయాలని కేంద్రం కోర్టును కోరింది. గతేడాది డిసెంబర్ 14న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు సరైనదే. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదు. 36 రఫేల్ విమానాల కొనుగోలు ధరల వివరాలు కాగ్‌కు ఇచ్చాం. యూపీఏ ప్రభుత్వం ఒప్పందం కన్నా 2.86శాతం తక్కువకు కొనుగోలు చేశాం. పిటిషనర్లు పొందుపర్చిన పత్రాలు రక్షణశాఖకు సంబంధించిన రహస్య పత్రాల్లొ కొంతభాగం మాత్రమే. అవి ఒప్పంద సమయంలో నిపుణులు ఇచ్చిన సలహాలకు సంబంధించినవి. పిటిషనర్లు పొందుపర్చిన పత్రాలు... ఖరారైన రఫేల్ ఒప్పంద పత్రాలు కావు. దేశరక్షణకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని మరోసారి అఫిడవేట్‌లో కేంద్రం పేర్కొంది. సోమవారం సుప్రీంకోర్టులో రఫేల్ రివ్యూ పిటిషన్లు విచారణకు రానున్నాయి.

703
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles