తీవ్రస్థాయి ప్రకృతి విపత్తు.. ప్ర‌క‌టించిన కేంద్రం

Mon,August 20, 2018 07:20 PM

Centre declares Kerala floods calamity of severe nature

న్యూఢిల్లీ: కేరళలో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇది ప్రకృతి సృష్టించిన తీవ్ర స్థాయి విపత్తు అని కేంద్రం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఈ ప్రకటన చేసింది. ఈ శతాబ్ధంలోనే ఇవి అత్యంత దారుణమైన వరదలు అని హోంశాఖ వెల్లడించింది. కేరళలో వరదల వల్ల సుమారు 350 మంది చనిపోయారు.

రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు, లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌.. పార్ల‌మెంట్ స‌భ్యుల‌ను విరివిగా కేర‌ళ స‌హాయం చేయాల‌ని కోరారు. ఎంపీల్యాడ్ ఫండ్స్ నుంచి విరాళాల‌ను విడుద‌ల చేయాల‌ని అభ్య‌ర్థించారు. ఇప్ప‌టికే ఎంపీలు త‌మ ఒక నెల వేత‌నాన్ని విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మాల్దీవుల ప్ర‌భుత్వం కేర‌ళ కోసం 50 వేల డాల‌ర్ల స‌హాయాన్ని ప్ర‌క‌టించింది.

రాష్ట్రంలో ఉన్న శ‌ర‌ణార్థుల‌కు కూడా సాయం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం విజ‌య‌న్ ఆదేశించారు. వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన వారికి త్వ‌ర‌లోనే స్కూల్ స‌ర్టిఫికెట్ల‌ను జారీ చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్ప‌ష్టం చేశారు.

3040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles