రాష్ట్ర పోలీసుల పిల్లలకు కేంద్ర ఉపకారవేతనం

Fri,May 31, 2019 06:14 PM

Central scholarship for state police children

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత ఇది తొలి సమావేశం. రెండోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. భారత రక్షణ నిధి ద్వారా ఉపకార వేతనాలు ఇచ్చే కార్యక్రమంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాలురకు ఇప్పటి వరకు ఉన్న ఉపకార వేతనం రూ. 2 వేల నుంచి రూ.2500లకు పెంచారు. బాలికలకు రూ.2250 నుంచి రూ.3000లకు పెంచారు. ఇప్పటి వరకు కేంద్ర పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన ఉపకార వేతనాలు రాష్ర్టాలకూ విస్తరించారు. రాష్ట్ర పోలీసు విభాగానికి కూడా ఉపకారవేతనాలు వర్తించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి రాష్ట్రం నుంచి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగం పిల్లలను ఎంపిక చేసి వారికి ఉపకార వేతనాలు అందిస్తారు. వీటన్నింటికి కేంద్ర హోంశాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా ఉండనుంది.3483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles