ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై కేంద్రం కొరడా!

Fri,June 8, 2018 10:02 PM

Central govt want to take Special act on Private school fees

న్యూఢిల్లీ: ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రుల నడ్డి విరగ్గొడుతున్న ప్రైవేటు పాఠశాలలకు కళ్లెం వేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నది. ఏకపక్షంగా ఫీజులు పెంచకుండా వాటిని నియంత్రించే చట్టానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నది. నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దుచేయడంతోపాటు జరిమానా కూడా విధించనున్నది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల్ని నియంత్రిస్తూ ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ ప్రత్యేకంగా చట్టం తెచ్చింది. ఇది విజయవంతం కావడంతో ఈ చట్టాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేంద్రం జాతీయ స్థాయిలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రైవేట్ స్కూళ్లపై కొరడా ఝుళిపించేందుకు ముందుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ వర్గాలు, సంస్థల అభిప్రాయాలు, సూచనల్ని పరిగణలోకి తీసుకున్న అనంతరం విస్తృత సంప్రదింపుల ద్వారా ఈ చట్టాన్ని అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

4097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles