మాల్యా కోసం జైలు రెడీ.. ఇదీ ఆ సెల్

Mon,December 10, 2018 02:24 PM

Cell in Arthur Road Jail is ready for Vijay Mallya

ముంబై: బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి పారిపోయిన బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో సెల్‌ను సిద్ధం చేసి ఉంచారు. మరికాసేపట్లో యూకే కోర్టు మాల్యా అప్పగింత కేసు విచారణ జరపనున్న నేపథ్యంలో ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే మాల్యాను ఉంచడానికి ఈ హై సెక్యూరిటీ సెల్‌ను సిద్ధంగా ఉంచారు. రూ.9 వేల కోట్ల మేర మోసం, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసుకు సంబంధించి మాల్యా లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్ కోర్టుకు సోమవారం హాజరుకానున్నాడు. ఆర్థర్ రోడ్ జైల్లో అత్యంత భద్రత ఉన్న బారాక్స్‌లో ఈ సెల్ ఉంది. ఇక్కడే ముంబై దాడుల దోషి కసబ్‌ను కూడా గతంలో ఉంచారు. ఒకవేళ మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశిస్తే ఈ జైల్లో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తామని ఇక్కడి సీనియర్ అధికారి వెల్లడించారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా బరాక్‌లో ఉన్న డిస్పెన్సరీలో చికిత్స అందించేందుకు డాక్టర్లు ఉన్నారని చెప్పారు. జైల్లోని ఇతర సెల్స్‌కు దూరంగా ఈ హైసెక్యూరిటీ బరాక్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడూ సీసీటీవీ నిఘాలో ఉంటాయి.

3148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles