బీజేపీలో చేరిన సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిష్ట్

Mon,April 22, 2019 07:20 PM

CELEBRITY Hair Stylist Jawed Habib joins Bharatiya Janata Party


న్యూఢిల్లీ: సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిష్ట్ జావెద్ హబీబ్ బీజేపీ లో చేరారు. ఢిల్లీలోని కార్యాలయంలో బీజేపీ నేతలు జావెద్ హబీబ్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జావెద్ హబీబ్ ప్రపంచంలో ఉన్న ది బెస్ట్ హెయిర్‌డ్రెస్సర్లలో ఒకరు. జావెద్ హబీబ్‌కు 3 అంతర్జాతీయ స్థాయి సెలూన్లుండగా..భారత్‌లో వివిధ ప్రాంతాల్లో 550 హెయిర్‌సెలూన్లున్నాయి. ఇప్పటివరకు నేను హెయిర్ (వెంట్రుకలు)కు గార్డును..కానీ ఇప్పటి నుంచి ఈ దేశానికి సెక్యూరిటీ గార్డునని ఈ సందర్భంగా జావెద్ హబీబీ అన్నారు. ఆరో విడతలో భాగంగా మే 12 న ఢిల్లీలో పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జావెద్ హబీబ్ పార్టీలో చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది.

1386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles