ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు

Sun,March 10, 2019 05:45 PM

CEC Announces National elections Schedule

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మీడియా సమావేశంలో సీఈసీ సునీల్‌ అరోరా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. సీఈసీ సునీల్‌ ఆరోరా మాట్లాడుతూ.. జూన్‌ 3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై సమగ్రమైన చర్చలు జరిపాం. దేశవ్యాప్తంగా పండుగలు, పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించాం. వాతావరణం, పంటకోతల సమయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని సునీల్‌ అరోరా తెలిపారు.

పోలింగ్‌ స్టేషన్లలో పర్యవేక్షణ, సునిశిత పరిశీలన ఉంటుందని సునీల్ అరోరా చెప్పారు. ఓటు హక్కు వినియోగానికి 12 గుర్తింపు కార్డులు పరిగణలోకి తీసుకోనున్నామన్నారు. పోలింగ్‌ కు 5 రోజులు ముందుగా ఓటర్లకు పోల్‌ చిట్టీలు పంపిణీ చేయడం జరుగుతుంది. పోల్‌ చిట్టీలను గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకోమన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అదనంగా లక్ష పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వీవీ ప్యాట్‌ లు వినియోగిస్తామని చెప్పారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లకు అనుమతి నిరాకరించనున్నట్లు తెలిపారు. పర్యావరణహిత ఎన్నికల ప్రచార సామాగ్రి మాత్రమే వినియోగించాలన్నారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లుండగా..వీరిలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సున్న ఓటర్లు 1.5 కోట్లున్నారని సీఈసీ తెలిపారు.

ఏడు విడతల్లో లోకసభ ఎన్నికలు


లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగనున్నట్లు సీఈసీ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి.
*మార్చి 18న మొదటి నొటిఫికేషన్‌ విడుదల
*ఏప్రిల్‌ 11న తొలి విడత లోక్ సభ ఎన్నికలు
*ఏప్రిల్ 18న రెండోదశ లోక్ సభ ఎన్నికలు
*ఏప్రిల్ 23న మూడో దశ లోక్ సభ ఎన్నికలు
*ఏప్రిల్ 29న నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు
*మే 6న ఐదో దశ లోక్ సభ ఎన్నికలు
*మే 12న ఆరోదశ లోక్ సభ ఎన్నికలు
*మే 19న ఏడో దశ లోక్ సభ ఎన్నికలు
*మే 23న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు

5624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles