హాస్పటల్లో జయలలిత.. సీసీటీవీ ఫూటేజ్ డిలీట్

Thu,September 20, 2018 10:04 AM

CCTV footage of Jayalalithaas stay deleted, tells Apollo hospital

చెన్నై: దివంగత మాజీ సీఎం జయలలిత చెన్నైలోని అపోలో హాస్పటల్‌లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అయితే హాస్పటల్ సీసీటీవీ ఫూటేజ్ డిలీట్ అయ్యిందని అపోలో హాస్పటల్స్ జయ కేసును విచారిస్తున్న జస్టిస్ ఏ.అరుముగస్వామి కమిషన్‌కు తెలియజేసింది. జయ హాస్పటల్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ కావాలని ఆ కమిషన్ డిమాండ్ చేసింది. అయితే ప్రతి 30 రోజులకు ఒకసారి సీసీటీవీ దృశ్యాలు ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతాయని ఆ కమిషన్ ముందు అపోలో అధికారి తెలిపారు. 2016, సెప్టెంబర్ 22 నుంచి 2016 డిసెంబర్ 5వ తేదీ వరకు జయలలిత అపోలో హాస్పటిల్‌లో ఉన్నారు. కొత్త దృశ్యాలు రావడం వల్ల నెల రోజుల కిందటి సీసీటీవీ ఫూటేజ్ ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుందని అపోలో అధికారి మైమూనా బాద్షా తెలిపారు.

1294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles