దాతి మహారాజ్‌పై రేప్ కేసు

Fri,October 26, 2018 04:49 PM

CBI register rape case against Daati Maharaj

న్యూఢిల్లీ: దాతి మహారాజ్‌పై సీబీఐ ఇవాళ రేప్ కేసు నమోదు చేసింది. అసహజ శృంగారం కింద కూడా ఆయనపై కేసును ఫైల్ చేశారు. దక్షిణ ఢిల్లీలో దాతి మహారాజ్ ఆలయం ఉన్నది. ఆశ్రమంలో ఉన్న మహిళను అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును టేకోవర్ చేసుకున్నది. ఓ మహిళా భక్తురాలు ఫతేపుర్ బేరి పోలీసు స్టేషన్‌లో దాతిమహారాజ్‌పై ఫిర్యాదు చేసింది. జూన్ 22వ తేదీన ఈ ఫిర్యాదు నమోదు చేశారు. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ దాతి మహారాజ్‌కు ఆశ్రమాలు ఉన్నాయి. అయితే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని మహారాజ్ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో విచారణ సరిగా చేయలేదని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ వీకే రావులతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

1980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles