సీబీఐ నంబర్ 2 అరెస్ట్‌కు రంగం సిద్ధం!

Fri,January 11, 2019 03:29 PM

CBI Number 2 Rakesh Asthana Faces Arrest as Delhi high court dismisses his plea

న్యూఢిల్లీ: సీబీఐ నంబర్ 2 రాకేష్ ఆస్థానాకు ఎదురు దెబ్బ తగిలింది. లంచం కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నజ్మి వజీరి.. స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేందర్ కుమార్‌లపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయడానికి నిరాకరించారు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు రాకేష్ ఆస్థానాను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించడానికి కూడా కోర్టు నిరాకరించింది. అయితే రెండు వారాల పాటు ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలని సీబీఐకి ఆదేశించింది. పది వారాల్లో రాకేష్ ఆస్థానాపై విచారణను పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. ఆయనపై నేరపూరిత కుట్ర, అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తన కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మరోవైపు ఫైర్‌సర్వీసెస్ డీజీగా బాధ్యతలు చేపట్టడానికి సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ నిరాకరించారు.

2089
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles