చందా కొచ్చార్‌పై లుకౌట్ నోటీసు

Fri,February 22, 2019 01:15 PM

CBI issues lookout notice against Chanda Kochhar in ICICI Bank Videocon loan case


న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌పై ఇవాళ సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్ సంస్థ‌కు అక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో రుణాలు ఇచ్చిన కేసులో చందా కొచ్చార్‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. చందా కొచ్చార్‌తో పాటు ఆమె భ‌ర్త దీప‌క్ కొచ్చార్‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. వీడియోకాన్ గ్రూపు ఎండీ వీఎన్ దూత్‌తో పాటు ఇత‌రులు కూడా ఈ కేసులో ఉన్నారు. వీడియోకాన్ సంస్థ‌కు సుమారు 3250 కోట్లు అక్ర‌మంగా ఇచ్చిన‌ట్లు చందాపై కేసు వేశారు.

1004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles