మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన శివసేన నేత అరెస్ట్

Sat,February 27, 2016 03:17 PM

Caught on Camera: Man thrashes woman traffic cop in Thane, arrested

ముంబై : విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన శివసేన నేత శశికాంత్ బాల్గుడేను థానే పోలీసులు అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తున్న శివసేన నేతను కానిస్టేబుల్ ఆపింది. వాహనాన్ని ఆపినందుకు ఆవేశంతో ఊగిపోయిన శివసేన నేత కానిస్టేబుల్‌ను విచక్షణా రహితంగా కొట్టాడు. మహిళా అని కూడా చూడకుండా చితకబాదాడు. ఈ దాడిపై బాధిత మహిళా కానిస్టేబుల్ థానే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా శివసేన నేతను అరెస్టు చేశారు. అయితే శశికాంత్‌తో శివసేనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. దాడికి పాల్పడ్డ వ్యక్తి తాను శివసేన నేతను అని తెలిపారు.

1422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles