ఎక్కడ చూసిన ‘నో క్యాష్’ బోర్డులే

Tue,April 17, 2018 10:55 AM

Cash Crunch At ATMs In Many States Say Reports

న్యూఢిల్లీ : దేశ ప్రజలను నగదు సమస్య వెంటాడుతుంది. ఎక్కడా చూసిన ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక వేళ నగదు పెట్టినా క్షణాల వ్యవధిలోనే అయిపోతుంది. సరిపడనంతా డబ్బును ఏటీఎంలలో జమ చేయడం లేదు. దీంతో అత్యవసర పరిస్థితులు ఉన్న ప్రజలు నగదు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నెల రోజుల నుంచి పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో.. ఏటీఎంలలో సరిపడ నగదు లేకపోవడంతో.. సామాన్య ప్రజానీకం పడరాని కష్టాలు పడుతున్నారు. కనీసం ఒక పది వేల రూపాయాలు డ్రా చేసుకుందామన్న ఆ పరిస్థితి లేదు.

పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. అప్పటి కంటే పరిస్థితి ఇప్పడు దారుణంగా ఉంది. కొన్ని చోట్ల ఏటీఎంలలో కేవలం రెండు వేల రూపాయాల నోట్లు ఉండటంతో చిల్లర సమస్య ఉత్పన్నమవుతుంది. నోట్ల రద్దు నాటి నుంచి నగదు విషయంలో సమస్యలు తలెత్తుతున్న విషయం విదితమే.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు లేని పరిస్థితి ఉందన్నారు. డబ్బు కోసం 10 నుంచి 15 ఏటీఎంలను చెక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏటీఎంలలో సరిపడ నగదు పెట్టాలని బ్యాంకు అధికారులను ప్రజలు కోరుతున్నారు. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


కొన్ని రాష్ర్టాల్లో నగదు సమస్య వాస్తవమే : ఎస్పీ శుక్లా
కొన్ని రాష్ర్టాల్లో నగదు సమస్య ఉన్నమాట వాస్తవమేనని ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా పేర్కొన్నారు. ప్రస్తుతం లక్షా ఇరవై ఐదు వేల కోట్ల కరెన్సీ ఉందన్నారు. పలు రాష్ర్టాల్లో నగదు తక్కువగా ఉందన్నారు. దీంతో ప్రభుత్వం నగదు కొరతను తీర్చేందుకు రాష్ర్టాల వారీగా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. నగదు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల నుంచి నగదు లేని రాష్ర్టాలకు డబ్బు తరలించేందుకు ఆర్బీఐ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. నగదు కొరత సమస్య మూడు రోజుల్లో తీర్చుతామని శుక్లా స్పష్టం చేశారు.
3445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles