ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంట్లో భారీ చోరీ

Tue,October 16, 2018 11:22 AM

Cash and jewellery stolen from the residence of Principal secretary in UP

లక్నో: ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఉత్తరప్రదేశ్ సివిల్ డిఫెన్స్, పెన్షన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజన్ శుక్లాకు చెందిన ప్లాట్‌లో ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది. శనివారం లేదా ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్లు భావిస్తున్నారు. ఎల్లప్పుడు 24 గంటలు పటిష్ట భద్రత ఉండే సీఎస్‌ఐ టవర్స్‌లో చోరీ జరగడం సర్వత్రా షాకింగ్ న్యూస్‌గా మారింది. చోరీ సమయంలో రాజన్.. కుటుంబ సభ్యులతో కలిసి వారణాసిలో ఉన్నారు. దొంగలు గది తాళంను పగులగొట్టి, లాకర్స్‌ను బ్రేక్ చేసి లూటీకి పాల్పడ్డారు. పెద్దమొత్తంలో నగదు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫింగర్‌ప్రింట్ నిపుణులు, డాగ్ స్వాడ్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది.

1306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles