సబర్మతీ ఆశ్రమంలో కెనడా ప్రధాని

Mon,February 19, 2018 12:39 PM

Canadian PM Justin Trudeau along with his wife Sophie at Sabarmati Ashram in Ahmedabad

అహ్మదాబాద్ : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. నిన్న తాజ్ మహల్ అందాలను తిలకించిన ట్రూడూ, ఆయన భార్య సోఫియా, ముగ్గురు పిల్లలు.. ఇవాళ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రూడూ భార్య సోఫియా చరఖా తిప్పారు. ఈ సన్నివేశాన్ని ఆమె పిల్లలు ఎంజాయ్ చేశారు. గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్ టెంపుల్‌ను సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు కెనడా ప్రధాని. అక్కడ ఆలయ నిర్వాహకులు జస్టిన్ ట్రూడూకు ఘనస్వాగతం పలికారు. అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో జరిగే ఎడ్యుకేషన్ అండ్ ఇన్వస్ట్ మెంట్ అనే అంశంపై ఆయన విద్యార్ధులతో డిస్కస్ చేయనున్నారు
2164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles