ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి చూద్దాం!

Thu,December 7, 2017 03:24 PM

ఈ పజిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. ప్రశ్న చూస్తే సింపుల్‌గానే ఉంటుంది. కాని.. టక్కున సమాధానం మాత్రం చెప్పలేరు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ మెదడుకు పదును పెట్టండి. కింద ఇచ్చిన పజిల్‌కు సమాధానాన్ని చెప్పాలి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వైరలవుతున్న పజిల్ ఇది. సరే.. కింద ఇచ్చిన పజిల్‌ను జాగ్రత్తగా చదివి సాల్వ్ చేయండి.. మనం తర్వాత మాట్లాడుకుందాం.


చదివారా? అర్థమయిందా లేదా? ప్రశ్నలో కన్ఫ్యూజన్ ఏమన్నా ఉందా? సరే.. అసలు ప్రశ్న ఏంటంటే? "నువ్వు ఓ 7 కొవ్వత్తులను వెలిగించావు అనుకో. అందులో రెండు గాలికి ఆరిపోయాయి. ఇప్పుడు ఎన్ని కొవ్వత్తులు నీ దగ్గర మిగిలాయి..?" అదే ప్రశ్న. ఇప్పుడన్నా అర్థమయిందా.. సరే.. ఇప్పుడన్నా సాల్వ్ చేయండి.

చాలా మందికి ప్రశ్న చదవగానే టక్కున గుర్తొచ్చే సమాధానం.. 7. ఎందుకంటే.. రెండు గాలికి ఆరిపోయినా.. మొత్తం వెలిగించింది 7 కాబట్టి.. 7 అక్కడే ఉంటాయి అని వాళ్ల దైర్యం. మరి కొంతమంది సమాధానం 2. ఎందుకంటే.. మొత్తం వెలిగించింది 7.. అయితే.. అందులో రెండు ఆరిపోతే.. మిగిలిన 5 వెలిగే ఉన్నాయనేగా అర్థం. అవి వెలిగి ఉన్నాయంటే వేడికి కరిగిపోతాయి. దీంతో ఆరిపోయిన రెండే కదా అక్కడ ఉండేది. ఇంకొంతమంది లేదు లేదు సమాధానం 5.. అని, ఇలా ఎవరికి నచ్చిన సమాధానం వాళ్లు చెబుతున్నారు.

మరి మీ సమాధానం ఏంటి? దీనికి సరైన సమాధానం ఏదో మీరే చెప్పాలి. మేము చెప్పం. మీరే దీనికి సరైన సమాధానాన్ని రాబట్టి.. మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు చాలెంజ్ విసరండి. ఈ పజిల్‌ను సాల్వ్ చేయమని చెప్పండి.

3814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles