ఆధార్‌పై రేపు కీలక తీర్పు

Tue,September 25, 2018 06:52 PM

Can Aadhaar be made compulsory? Supreme Court decision tomorrow

న్యూఢిల్లీ: ఆధార్ తప్పనిసరా కాదా అన్న అంశంపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనున్నది. ఆధార్‌ను సవాల్ చేస్తూ సుప్రీం వద్ద 27 పిటీషన్లు ఉన్నాయి. మే నెలలో ఈ అంశంపై వాదనలు జరిగిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. జనవరిలో మొదలైన వాదనలు సుమారు 38 రోజులు పాటు సాగాయి. ప్రైవసీ హక్కును ఉల్లంఘిస్తున్నదని ఆధార్‌కు వ్యతిరేకంగా కేసులు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రైవసీ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని గత ఏడాది సుప్రీం అభిప్రాయపడింది. వంద కోట్ల మంది ఇప్పటికే ఆధార్ కోసం తమ డిజిటల్ ఐడెంటీని సమర్పించారు. ప్రభుత్వ పథకాల కోసం ఆధార్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఆధార్ వివరాల వల్ల వ్యక్తుల గోప్యతకు భంగం ఉందని చాలా మంది పిటీషన్లు వాదిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లు, ప్యాన్ కార్డు, సెల్‌ఫోన్ సర్వీసులు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సులకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు.

5121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles