హిమాచల్ ప్రదేశ్‌లో మంచు చిరుత.. వైరల్ ఫోటో

Thu,May 16, 2019 05:20 PM

మంచు చిరుత తెలుసా మీకు. అవి ఎక్కువగా మంచు కురిసే చోట, కొండలు, గుట్టల్లో ఉంటాయి. కొండలు గుట్టల రంగును పోలి ఉండే ఈ చిరుతను పక్కన ఉన్నా గుర్తు పట్టడం కష్టం. తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సౌరభ్ దేశాయ్ హిమాచల్ ప్రదేశ్‌లోని స్పిటి వ్యాలీలో మంచు చిరుతను చూసి తన కెమెరాతో క్లిక్‌మనిపించాడు. పెద్ద కొండ మధ్యలో ఉన్న చిరుతను ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. ఆ ఫోటోలో అసలు మంచు చిరుత ఎక్కడుందా అని నెటిజన్లు తెగ ప్రయత్నించారు. చాలామందికి చిరుతను కనుక్కోవడం సాధ్యం కాలేదు.


హిమాచల్ ప్రదేశ్‌లోని కిబ్బెర్ అనే గ్రామానికి వెళ్లిన దేశాయ్.. ఆ గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో మంచు చిరుతను చూశాడట. మంచు చిరుతలనే కొండల్లో ఉండే దెయ్యాలు అని పిలుస్తారు. ఇవి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. సముద్ర మట్టానికి 9800 ఫీట్ల నుంచి 17 వేల ఫీట్ల ఎత్తులో అవి నివసిస్తాయి. కనీసం మీరైనా ఆ ఫోటో చూసి అందులో మంచు చిరుత ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.
View this post on Instagram

Art of camouflage...

A post shared by Photographs by Saurabh Desai (@visual_poetries) on4359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles