అనుబంధం.. ఆహారం, నీళ్లు ముట్టని ఒంటె

Mon,March 4, 2019 12:00 PM

camel stopped taking food or water after police dies with heart attack

అహ్మదాబాద్‌ : నిత్యం తన వెంటే ఉండే పోలీసు అధికారి కనిపించక పోవడంతో ఓ ఒంటె ఆవేదన చెందుతోంది. కనీసం ఆహారం, నీళ్లు కూడా ముట్టడం లేదు. పోలీసు అధికారితో ఒంటెకున్న అనుబంధం అలాంటిది మరి. గుజరాత్‌ కుచ్‌ జిల్లా పరిధిలోని జకావు పోలీసు స్టేషన్‌లో శివరాజ్‌ గధ్వి(56) అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శివరాజ్‌ ప్రతి రోజు తనకు కేటాయించిన ఒంటెతో సరిహద్దులో పెట్రోలింగ్‌ నిర్వహించేవారు. ఈ ఏడాది జనవరి 24వ తేదీన సరిహద్దులోని పింగ్లేశ్వర్‌లో ఒంటెతో పాటు శివరాజ్‌ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో శివరాజ్‌కు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే శివరాజ్‌ పోలీసు స్టేషన్‌కు తిరిగి రాకపోయేసరికి సదరు ఒంటె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. శివరాజ్‌ కనిపించకపోవడంతో.. ఆ ఒంటె ఆహారం, నీళ్లు తీసుకోవడం లేదు. ఒంటెకు ఆహారం, నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

3325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles