
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి 63వ పుట్టిన రోజును ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆమ్రోహాలో బీఎస్పీ కార్యకర్తలు ఆమె జన్మదినం సందర్భంగా 63 కేజీల కేక్‌ను కూడా కట్ చేశారు. ముక్కలుగా కట్ చేసి అందరికీ పంచుదామని నిర్వాహకులు భావించారు. ఐతే అక్కడున్న కొంతమంది అతిథులు కక్కుర్తి పడి భారీ కేక్‌ను ఒకరినొకరు పోటీ పడి చేతులతో లాక్కొని తినడం ప్రారంభించారు.
ఇలా అందరూ కేక్ కోసం పోటీపడటంతో ఒకానొక దశలో అది కిందపడబోగా ఒక సీనియర్ నాయకుడు వచ్చి అడ్డుకున్నారు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు తమ కెమెరాల్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దామోహ్‌లో బీఎస్పీ ఎమ్మెల్యే రామ్ భాయ్ సింగ్ మాయావతి బర్త్‌డేను అట్టహాసంగా నిర్వహించారు. ఇందుకోసం బాలీవుడ్ పాటలతో కొంతమంది మహిళలతో డ్యాన్స్‌లు కూడా చేయించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు.