
న్యూఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాల కోనుగోలుకు సంబంధించిన అంశాలు ఇవాళ మరిన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంపై.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఇవ్వనున్నది. ఆ నివేదికను ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే రాఫేల్ ధరల గురించి కాగ్ నివేదికలోనూ ప్రస్తావించే వీలు లేదని కొందరంటున్నారు. కాగ్‌లో రాఫేల్ గురించి ఏం రాసి ఉందో చూద్దామని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వివరాలలే.. కాగ్‌లో ప్రస్తావిస్తారో లేదో చూడాల్సి ఉంటుందని ఖర్గే అన్నారు.