స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఉచితంగా ఉల్లిగడ్డలు

Tue,December 10, 2019 05:40 PM


కొన్ని రోజులుగా ఉల్లిధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. పెరిగిన ఉల్లిధరలకు ప్రతిపక్షాలు, ప్రజలు వివిధ రకాలుగా తమ నిరసనలు తెలుపుతున్నారు. జనాలు ఉల్లిగడ్డలు కొనేందుకు ఆలోచిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులను మొబైల్ షోరూం నిర్వాహకులు తెలివిగా బిజినెస్ ట్రిక్ కోసం వాడారు. పట్టుకొైట్టెలోని ఎస్‌టీఆర్ మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి ఉల్లిగడ్డలను ఉచితంగా అందజేసే ఆఫర్‌ను ప్రకటించారు.


తన షాపులో కొనుగోలు చేసే ప్రతీ స్మార్ట్‌ఫోన్‌పై కిలో ఉల్లిగడ్డను ఉచితంగా అందజేస్తున్నట్లు షాపు యజమాని శరవణకుమార్ ప్రకటించాడు. ఉల్లిధర నాణ్యతను గరిష్టంగా 200 రూపాయల వరకు పలుకుతోంది. మొబైల్ షాపును పబ్లిసిటీ కోసం స్మార్ట్‌ఫోన్‌కు ఉచిత ఉల్లిగడ్డల ఆఫర్ ప్రకటించగా..ఎంతోమంది వినియోగదారులను ఆకర్షించిందని శరవనకుమార్ తెలిపారు. సాధారణంగా నేను రోజుకు 3-4మొబైల్స్ అమ్మేవాడిని. కానీ ఉల్లి ఆఫర్ ప్రకటించిన తరువాత గత రెండు రోజుల నుంచి రోజుకు కనీసం 10 మొబైల్స్ అమ్ముడవుతున్నాయని అన్నాడు.

1721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles