మాల్యా.. నిరుపేద!

Sun,December 10, 2017 07:51 AM

Businessman Vijay Mallya has now become poor

లండన్: ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తుల్లో ఒకనిగా పేరు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇప్పుడు నిరుపేదగా మారిపోయాడు. భారత్‌లోని డజనుకు పైగా బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల అప్పులను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన ఆయన ప్రస్తుతం లండన్‌లో వారానికి 5 వేల పౌండ్ల (రూ. 4.5 లక్షల)తో జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న కేసుపై లండన్‌లో విచారణ జరుపుతున్న వెస్ట్‌మినిస్టర్ కోర్టు డాక్యుమెంట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసు విచారణ ప్రారంభించడానికి ముందు రోజు (ఈ నెల 3వ తేదీన) మాల్యాకు చెందిన ఆస్తులన్నింటినీ స్తంభింపజేయాలని వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఆదేశించింది. బ్రిటన్‌లో మాల్యా ఆస్తులన్నింటినీ స్తంభింపజేయాలని పేర్కొంటూ భారత న్యాయస్థానం ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన తీర్పుపై విచారణకు అనుమతిస్తూ వెస్ట్‌మినిస్టర్ కోర్టు న్యాయమూర్తి ఈ ఆదేశాన్ని జారీ చేశారు. ప్రస్తుతం మాల్యా తన జీవనం కోసం వారానికి 5 వేల పౌండ్ల చొప్పున అలవెన్సు పొందాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈ అలవెన్సును 20 వేల పౌండ్లకు పెంచాలని మాల్యా చేసుకున్న విజ్ఞప్తిపై న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

2408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles