6 మిస్డ్ కాల్స్ వచ్చాయి... ఖాతా నుంచి 1.86 కోట్లు గోవిందా!

Thu,January 3, 2019 03:14 PM

Businessman in Mumbai Loses 1.86 Crore After Getting 6 Missed Calls

మీ ఫోన్‌కు మిస్డ్ కాల్స్ వస్తే ఏం చేస్తారు. ఏం చేస్తాం.. అవసరమున్నోడు మళ్లీ చేస్తాడులే అనుకుంటాం. అంటారా? అలాగే ముంబైకి చెందిన ఓ బిజినెస్‌మాన్ కూడా అనుకున్నాడు. అదే అతడి కొంప ముంచింది. అతడి బ్యాంక్ ఖాతా నుంచి 1.86 కోట్ల రూపాయలు హాంఫట్ అయ్యాయి. కేవలం 6 మిస్డ్ కాల్స్ అతడి జీవితాన్ని నాశనం చేశాయి.

స్విమ్ స్వాప్ అనే టెక్నిక్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఆయన అకౌంట్‌లో నుంచి డబ్బులు కొట్టేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి 2 గంటలకు అతడికి 6 మిస్డ్ కాల్స్ వచ్చాయి. నెంబర్ కోడ్ +44 ఉండటంతో యూకే నుంచి కాల్ వస్తోందనుకున్నాడు. ఉదయం అదే నెంబర్‌కు కాల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ.. ఫోన్ కలవలేదు. అస‌లు తన మొబైల్‌లో సిగ్నలే లేదు. తన సిమ్ డియాక్టివేట్ అయిపోయింది. వెంటనే సర్వీస్ ప్రొవైడర్‌కు ఫోన్ చేశాడు. మీరే డియాక్టివేషన్‌కు రిక్వెస్ట్ పెట్టారు కదా సార్.. అంటూ సమాధానం వచ్చింది. నిశ్చేష్టుడైపోయాడు. ఏదో జరుగుతోందని అర్థమయింది. వెంటనే బ్యాంకుకు కాల్ చేశాడు. తన ఖాతా నుంచి 1.86 కోట్లు విత్‌డ్రా అయినట్టు బ్యాంక్ అధికారులు చెప్పారు.

మొత్తం 28 ట్రాన్జాక్షన్స్ జరిగాయని... 14 అకౌంట్లలోకి డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిందని బ్యాంకు అధికారులు చెప్పారు. బ్యాంకు అధికారులు మాత్రం 20 లక్షల వరకు రికవరీ చేయగలిగారు. వెంటనే దీనిపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. సిమ్ స్వాపింగ్ టెక్నిక్ ద్వారానే అతడి అకౌంట్ నుంచి డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేసినట్టు గుర్తించారు. అయితే.. స్విమ్ స్వాపింగ్ చేయాలంటే.. ఖచ్చితంగా సిమ్‌కు సంబంధించిన యూనిక్ నెంబర్ తెలిసి ఉండాలన్నారు. అంటే.. ఎవరో తెలివిగా.. అతడి యూనిక్ సిమ్ నెంబర్ తెలుసుకొని ఇలా.. సిమ్ స్వాపింగ్ టెక్నిక్‌కు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. అతడి ఫోన్ డియాక్టివేట్ అయిందో కాలేదో తెలుసుకోవడం కోసమే.. అర్ధరాత్రి అతడికి నేరగాళ్లు మిస్‌కాల్స్ ఇచ్చి ఉంటారని పోలీసులు తెలిపారు.

4794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles