ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య

Tue,June 11, 2019 02:48 PM

businessman and his wife and daughter killed in Bihar

పాట్నా : బీహార్‌లోని కిద్వాయ్‌పురిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. నితిన్‌ సరాఫ్‌ అనే వ్యక్తి వృతిరీత్యా వ్యాపారి. ఈయనకు భార్య ఆక్లా సరాఫ్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సోమవారం రాత్రి నితిన్‌, ఆక్లాతో పాటు వారి కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నితిన్‌ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నితిన్‌ సరాఫ్‌ పాట్నాలో పేరొందిన వ్యాపారి. ఆయనకు చాలా బట్టల షాపులు కూడా ఉన్నాయి. అయితే వీరి హత్యకు భూ వివాదాలే కారణమని తెలుస్తోంది.

4766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles