గోవ‌ధ‌.. రాళ్ల దాడిలో పోలీసు మృతి

Mon,December 3, 2018 04:46 PM

Bulandshahr SHO killed by mob in violence after rumours of cow slaughter

బులంద్‌షెహ‌ర్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షెహ‌ర్‌లో ఇవాళ ఆందోళ‌న‌కారులు చేసిన దాడిలో ఓ పోలీసు మృతిచెందారు. ఆ ప్రాంతంలో గో వ‌ధ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డంతో ఆందోళ‌న‌కారులు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేపట్టారు. నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళ‌న‌కారులు రాళ్లు రువ్వారు. ఆ ఘ‌ట‌న‌లో స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘ‌ట‌న స‌యానా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. ఉద‌యం సుమారు 11 గంట‌ల స‌మ‌యంలో ఆందోళ‌న‌కారులు ఆందోళ‌న‌కు దిగారు, వాళ్లంతా రోడ్డుపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు, అయితే వాళ్ల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నంలో పోలీసులుపై రాళ్లు రువ్వార‌ని, ఈ నేప‌థ్యంలో ఎస్‌హెచ్‌వో సుబోధ్ కుమార్ మృతిచెందిన‌ట్లు బులంద్‌షెహ‌ర్ జిల్లా మెజిస్ట్రేట్ అనుజ్ తెలిపారు.

1823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles