ఇది రైతు బడ్జెట్ : ప్రధాని

Thu,February 1, 2018 01:50 PM

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది రైతు హిత బడ్జెట్ అని ఆయన అన్నారు. బడ్జెట్ అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. రైతులకు, సాధారణ పౌరులకు, వ్యాపారవేత్తలకు బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. ఈ బడ్జెట్‌తో జీవిత విధానం మరింత సరళంగా మారుతుందన్నారు. అన్ని రంగాలపై బడ్జెట్‌ను కేంద్రీకరించారన్నారు. వ్యవసాయం నుంచి మౌళిక సదుపాయాల కల్పన వరకు కేటాయింపులు జరిగాయన్నారు. రైతులు, దళితులు, గిరిజన వర్గాలు ఈ బడ్జెట్ నుంచి లాభం పొందుతారన్నారు. గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ద్వారా కొత్త అవకాశాలు వస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. అన్ని తరహా పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్థిక మంత్రికి కంగ్రాట్స్ తెలిపారు. కనీస మద్దతు ధర రైతులకు విశేషంగా ఉపయోగపడుతుందని ప్రధాని చెప్పారు.

2333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles