రైల్వేలకు రూ.1.48 లక్షల కోట్లు

Thu,February 1, 2018 12:23 PM

Budget 2018 Jaitley fixes railways Rs 1.48 lakh crore

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. గత సంవత్సరం నుంచి రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ లేని సంగతి తెలిసిందే. ఈసారి సాధారణ బడ్జెట్‌లో రైల్వేశాఖకు రూ.1,48,528 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో కాపలా లేని 4,267 లెవెల్ క్రాసింగ్‌లను తొలగిస్తామని తెలిపారు. అన్ని రైల్వేస్టేషన్‌లలో రైళ్లలో వైఫై, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. 600 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ చేపడతామన్నారు. 36 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్స్ పునరుద్ధరణ. 18వేల కిలోమీటర్ల డబ్లింగ్ పనులు. అన్ని రైల్వే స్టేషన్‌లలో ఎస్కలేటర్లు. 12,000 వ్యాగన్లు, 5160 కోచ్‌లు, 700 లోకోమోటీవ్‌లను ఉత్పత్తి చేస్తున్నాం. హైస్పీడ్ రైళ్ల కోసం ఉద్యోగులను బర్తీ చేస్తాం. రైల్వేల విద్యుతీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నాం. వడోదరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

2761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles