బీజేపీని గద్దె దించాలి : బీఎస్పీ

Sat,January 19, 2019 01:46 PM

BSP leader SC Mishra at the opposition rally in Kolkata

కోల్‌కతా : దేశంలోని అన్ని వర్గాల నుంచి ఒక్కటే స్వరం వస్తున్నది.. బీజేపీని గద్దె దించాలని అందరూ కోరుకుంటున్నారని బీఎస్పీ నేత సతీశ్ మిశ్రా స్పష్టం చేశారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విపక్షాల ఐక్య ర్యాలీలో సతీశ్ మిశ్రా పాల్గొని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్మిక, కర్షక వర్గాలకు ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు సృష్టించింది. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓబీసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంపెనీలు మూతపడ్డాయి. రైతులు నిరాశతో ఉన్నారని మిశ్రా పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. రాజ్యాంగ్నా పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు సతీశ్ మిశ్రా.

1297
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles