రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ 8జీబీ డాటా

Sat,February 4, 2017 07:15 AM

BSNL lowers mobile Internet rate to Rs36 per GB to counter Reliance Jio offers

న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 3జీ మొబైల్ ఇంటర్నెట్ చార్జీలను నాలుగింతలు తగ్గించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.36కే 1జీబీ డాటాను అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. రూ.291 ప్లాన్ కింద వినియోగదారుడికి నాలుగు రెట్లు డాటా అంటే 8జీబీ డాటా లభించనున్నది. ఈ డాటాను 28 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. గతంలో 2జీబీ డాటా మాత్రమే లభ్యమయ్యేది. ప్రస్తుతం టెలికం ఇండస్ట్రీలో అందిస్తున్న డాటాతో పోలిస్తే ఇదే తక్కువ ధరది కావడం విశేషం. ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు తక్కువ ధరకే డాటాను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్‌కే మిట్టల్ తెలిపారు.

3611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles