బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమ్మె వాయిదా

Mon,December 3, 2018 07:50 AM

BSNL employees strike postponed

న్యూఢిల్లీ: తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ తలపెట్టిన మెరుపు సమ్మెను ప్రస్తుతానికి వాయిదావేసుకుంటున్నట్లు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. త్వరలో టెలికం మంత్రి మనోజ్ సిన్హాను కలిసి విన్నవించుకోనున్నారు. ఆదివారం టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్‌తో చర్చలు జరిపినట్లు, ముఖ్యంగా 4జీ స్పెక్ట్రం కేటాయింపులు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి పెన్షన్ రివిజన్, పెన్షన్ చెల్లింపులు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందనరాలేదని ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 3 నుంచి దీర్ఘకాలికంగా సమ్మె చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఒకవేళ మంత్రితో జరుపనున్న చర్చలు విఫలమైతే ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles