బ్యాగులో పెట్టి కుక్కపిల్లల రవాణా..ధర రూ.20 లక్షలపైనే

Wed,December 11, 2019 05:59 PM


పశ్చిమబెంగాల్: ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి అక్రమంగా తరలిస్తున్న రష్యన్ కుక్కపిల్లలను బీఎస్‌ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం ఓ వ్యక్తి బ్యాగు పట్టుకుని అముదియా సరిహద్దు చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్నాడు. అయితే ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్ అనుమానాస్పదంగా కనిపించడంతో బీఎస్‌ఎఫ్ జవాన్ అతన్ని ఆపాడు. జవానును చూసిన సదరు వ్యక్తి బ్యాగు అక్కడే వదిలేసి పారిపోయాడు.


జవాన్ ఆ బ్యాగులో బొర్జాయిస్ జాతికి చెందిన రష్యన్ కుక్కపిల్లలను గుర్తించాడు. బ్యాగులో కూరగాయల కింద ఏడు నెలల వయస్సున్న 2 కుక్క పిల్లల కాళ్లు కట్టేసి ఉండగా..అరువకుండా నోటికి గుడ్డ కట్టి ఉంది. కుక్క పిల్లలు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి..చికిత్స కోసం వెటర్నరీ సెంటర్‌కు పంపించామని బీఎస్‌ఎఫ్ 112వ నాగా బెటాలియన్ కమాండెంట్ అరున్ దహియా తెలిపారు. బొర్జాయిస్ జాతి కుక్కలు భారత్‌తో రూ.20 లక్షలకుపైగా ధర పలుకుతాయన్నారు. ఈ జాతి శునకాలు సన్నని పొడవాటి ముఖం కలిగి ఎత్తుగా ఉంటాయి.

2735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles