యడ్డీ.. మూడు సార్లు.. ముణ్నాళ్ల ముచ్చటే!

Sat,May 19, 2018 04:27 PM

BS yeddyurappa resign to his CM POst before floor test

బెంగళూరు : బీజేపీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప కథ ముగిసింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ యడ్డీకి.. అది ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. 2007లో 8 రోజులు, 2008లో 3 సంవత్సరాల 2 నెలలు, ఇప్పుడు 55 గంటలు మాత్రమే సీఎంగా కొనసాగారు. ప్రస్తుతం సాధారణ మెజార్టీ కోసం యడ్యూరప్ప చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ నేతలతో జరిపిన బేరసారాలు ఫలించలేదు. దీంతో బలపరీక్ష కంటే ముందే యడ్డీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

యడ్యూరప్ప తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టిన సమయంలో కేవలం 8 రోజులు మాత్రమే సీఎంగా కొనసాగారు. 2007 నవంబర్ 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడ్డీ.. జేడీఎస్ సహకారంతో సంకీర్ణ పాలనకు శ్రీకారం చుట్టారు. కానీ జేడీఎస్ మద్దతుకు అంగీకరించకపోవడంతో 8 రోజులకే యడ్యూరప్ప పదవికి కోల్పోవాల్సి వచ్చింది.

ఇక రెండోసారి 2008 అసెంబ్లీ ఎన్నికల్లో శికారిపురి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మే 30న సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అక్రమ మైనింగ్ కేసును దర్యాప్తు చేస్తూ కర్ణాటక లోకాయుక్త సీఎం యడ్యూరప్ప పేరును చేర్చడంతో బీజేపీ అధిష్టానం ఒత్తిడి మేరకు 2011, జులై 31న సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు 3 సంవత్సరాల 2 నెలలు సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఇక ఇప్పుడు సాధారణ మెజార్టీ లేకపోవడంతో బలపరీక్ష కంటే ముందే యడ్డీ సీఎం పదవికి రాజీనామా చేశారు. 2018లో సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప కేవలం 55 గంటలు మాత్రమే సీఎంగా కొనసాగారు.

1886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles