బీజేపీ పెద్ద‌ల‌కు య‌డ్డీ 1800 కోట్ల లంచం ఇచ్చారు..

Fri,March 22, 2019 04:59 PM

BS Yeddyurappa paid 1800 crores as bribes to bjp top leaders, alleges congress party

హైద‌రాబాద్: క‌ర్నాట‌క మాజీ సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప‌పై.. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. బీజేపీ టాప్ నేత‌ల‌కు క‌ర్నాట‌క మాజీ సీఎం య‌డ్డీ సుమారు 1800 కోట్లు లంచంగా ఇచ్చిన‌ట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఢిల్లీలో ఇవాళ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోప‌ణ‌లు చేశారు. య‌డ్డీ డైయిరీస్ వివ‌రాల‌ను ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు. బీజేపీ బ‌డా నేత‌ల‌కు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చిన య‌డ్డీపై లోక్‌పాల్ చేత విచార‌ణ చేప‌ట్టాల‌ని సుర్జేవాలా డిమాండ్ చేశారు. బీజేపీ కీల‌క నేత‌ల‌కు ఎంత ఎంత ఇచ్చారో ఆ అంశాల‌ను య‌డ్డీ త‌న డైయిరీలో రాసుకున్నారని, క‌ర్నాట‌క సీఎంగా ఉన్న స‌మ‌యంలో య‌డ్యూర‌ప్ప ఆ సొమ్మును అక్ర‌మంగా పంపిణీ చేశారని, బీజేపీ సెంట్ర‌ల్ క‌మిటీకి వెయ్యి కోట్లు, ఆర్థిక మంత్రి జైట్లీకి 150 కోట్లు, ర‌వాణా మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి 150 కోట్లు, హోంమంత్రి రాజ్‌నాథ్‌కు వంద కోట్లు, అద్వాణీ, జోషీల‌కు చెరో 50 కోట్లు ఇచ్చిన‌ట్లు య‌డ్డీ త‌న డెయిరీలో రాసుకున్నార‌ని కాంగ్రెస్ ఆరోపించింది. గ‌డ్క‌రీ కుమారుడి పెళ్లి కోసం కూడా య‌డ్డీ ప‌ది కోట్లు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కార‌వాన్ మ్యాగ్జిన్‌లో య‌డ్డీ డెయిరీస్ రిపోర్ట్ వ‌చ్చింది. దాని ఆధారంగానే ఇవాళ కాంగ్రెస్ ఈ ఆరోప‌ణ‌లు చేసింది. లంచం తీసుకున్నార‌న్న అంశంపై మోదీ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సుర్జేవాలా డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను య‌డ్యూర‌ప్ప కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ, దాని నేత‌లు వింత ఆలోచ‌న‌ల‌తో దివాళా తీశార‌ని, మోదీ పాపులారిటీని చూసి వాళ్లు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని, కార‌వాన్ రిపోర్ట్ నిజం కాదు అని ఇప్ప‌టికే ఐటీశాఖ నిరూపించింద‌ని య‌డ్యూర‌ప్ప అన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మైలేజీ కోస‌మే కాంగ్రెస్ ఈ ఆరోప‌ణ‌లు చేస్తోంద‌న్నారు.

1760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles