త్వరలో బెల్జియం-ముంబై విమాన సర్వీసులు బంద్

Wed,September 19, 2018 04:05 PM

న్యూఢిల్లీ: బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ (బెల్జియం)భారత్‌కు విమాన సర్వీసులను నిలిపేయాలని భావిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి బెల్జియం-ముంబై మధ్య విమాన సర్వీసులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బ్రస్సెల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ఓ ప్రకటనలో వెల్లడించారు. బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ ముంబైకు విమాన సర్వీసులను ప్రారంభించి ఏడాదిన్నర అవుతుంది.

విమాన సర్వీసులు ఆర్థికంగా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో..సర్వీసులను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జనవరి 7 తర్వాత విమాన ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నవారు..తమను సంప్రదిస్తే వారికి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని బ్రస్సెల్స్ ప్రతినిధులు తెలిపారు. బెల్జియం-ముంబై మార్గాల మధ్య వారానికి ఆరు విమాన సర్వీసులు సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సర్వీసులు వారంలో ఐదు సార్లు రాకపోకలను కొనసాగిస్తున్నాయి.

1059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles