పెండ్లికూతురిపై కాల్పులు.. అయినా ఏకమైన జంట

Fri,January 18, 2019 11:34 AM

Bride Shot At In Delhi Returns From Hospital For Wedding Ceremony

న్యూఢిల్లీ: పెండ్లిపీటలెక్కబోతున్న వధువుపై గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఈస్ట్ ఢిల్లీ శకర్‌పూర్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. వధువు పూజ(19), వరుడు భరత్ ఇరువురికి వివాహం కాసేపట్లో జరగనుంది. అంతలోనే ఓ వ్యక్తి పెండ్లికూతురిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ కాలులోంచి దూసుకెళ్లింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇరువురు వివాహబంధంతో ఒక్కటయ్యారు. తనపై ఎవరు కాల్పులు జరిపారో తెలియదని వధువు పేర్కొంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు పెండ్లికి వచ్చిన అతిథులను నిందితుడి గుర్తింపు కోసం విచారిస్తున్నారు. ఇటువంటి ఘటనే గతేడాది నవంబర్‌లో ఢిల్లీలో మరొకటి చోటుచేసుకుంది. పెండ్లికొడుకు రథంపై వస్తుండగా ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. మూడు గంటల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి తిరిగివచ్చి వెళ్లి పెండ్లికూతురు మెడలో తాళి కట్టాడు.

2342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles