పెళ్లికి కొన్ని గంటల ముందు పెళ్లి కూతురు కిడ్నాప్

Fri,January 25, 2019 03:14 PM

Bride Kidnapped by strangers hours before wedding in Punjab

అమృత్‌సర్: మరికొద్ది గంటల్లో పెళ్లి జరగనుందనగా.. పెళ్లి కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని ముక్త్‌సర్‌లో జరిగింది. శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో సదరు యువతి బ్యూటీపార్లర్ నుంచి బయటకు వస్తుండగా.. కిడ్నాప్ చేశారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ముక్త్‌సర్ ఎస్పీ రణ్‌బీర్ సింగ్ వెల్లడించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఆ బ్యూటీ పార్లర్ బయటే చాలా సేపటి నుంచి వేచి చూస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌ను బట్టి స్పష్టమవుతున్నది. తనను కిడ్నాప్ చేసే సమయంలో ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది.

2640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles