కాళ్లు, చేతులకు 12 వేళ్లు ఉన్న బాలుడి బలికి ప్రయత్నం..!

Mon,September 3, 2018 12:30 PM

Boy with 12 fingers and 12 toes was tried to kill by tantrik suggestion

ఉత్తరప్రదేశ్: బరాబంకీలో మూఢనమ్మకాలతో ఓ బాలుడిని బలివ్వడానికి ప్రయత్నాలు జరిగాయి. ఓ బాలుడి కాళ్లకు 12 వేళ్లు, చేతులకు 12 వేళ్లు ఉన్నాయి. అయితే.. ఇటువంటి డిజార్డర్స్‌తో పుట్టిన పిల్లలను బలి ఇస్తే ఆ ఫ్యామిలీలో లక్ష్మీ తాండవిస్తుందని మాంత్రికులు చెప్పడంతో ఆ బాలుడి బంధువులు అతడిని బలి ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు అతడిని ఇంట్లో నుంచి బయటికి రానివ్వడం లేదు. ఆ మాంత్రికుడి మాటలు విని ఎవరు తమ కొడుకును పొట్టనబెట్టుకుంటారో అని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. చివరకు స్కూల్ కూడా మాన్పించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దానిపై విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఆ బాలుడి చదువు ఖర్చులను నేను భరిస్తా..
"మాకు ఫిర్యాదు అందింది. ఆ మాంత్రికుడు, బాలుడిని బలి ఇవ్వడానికి ప్రయత్నించిన వ్యక్తులపై కేసు నమోదు చేశాం. ఆ బాలుడి చదువు కూడా ఆగడానికి వీళ్లేదు. వాళ్లు పేదవాళ్లు కాబట్టి.. ఆ బాలుడి చదువు ఖర్చులను నేను భరిస్తా.. నేను ఇక్కడ పనిచేసినన్ని రోజులు ఆ పిల్లాడికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటా.." అని బరాబంకీ సీఐ ఉమాశంకర్ సింగ్ హామీ ఇచ్చారు.

3871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles