తల్లి కళ్లెదుటే.. బిడ్డ ప్రాణాలను బలిగొన్న కుక్కలు

Sat,May 11, 2019 11:38 AM

Boy Killed By Stray Dogs As Mother Watched In Horror In Bhopal

భోపాల్‌ : నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి కళ్లెదుటే ఆరేండ్ల పసి బాలుడి ప్రాణాలను కుక్కలు బలిగొన్నాయి. ఈ దారుణ సంఘటన భోపాల్‌ అవధ్‌పూరి ఏరియాలోని శివసంగ్రాం నగర్‌లో చోటు చేసుకుంది. ఈ మహిళ గత నెలలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సర్జరీ ద్వారా డెలివరీ కావడంతో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె కుమారుడు(6) ఇంటికి 300 మీటర్ల దూరంలో ఆడుకుంటున్నాడు. అయితే భర్త ఇంటికొచ్చి కుమారుడి గురించి ఆరా తీశాడు. అప్పుడు ఆ తల్లి తన బిడ్డ ఎక్కడున్నాడు అని బయటకు వచ్చి చూడగా.. ఆ చిన్నోడిని కుక్కలు చుట్టుముట్టాయి. తల్లి చూస్తుండగానే కుక్కలు ఆ బాలుడిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో తల్లి బోరున విలపించింది. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కలను కాలనీల్లో నుంచి తరిమేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

3071
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles