గూడ్స్ రైలుపై సెల్ఫీ తీసుకుంటూ..

Mon,February 11, 2019 05:20 PM

Boy died while Click selfie atop goods train

జంషెడ్ పూర్ : సెల్ఫీసరదా ఓ బాలుడి ప్రాణాల మీదికొచ్చింది. ఇద్దరు బాలురు గూడ్స్ రైలుపై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా హైటెన్షన్ వైర్లు తాకి షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఎండీ ఫైజల్ (14) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..నవేద్ అక్తర్ (12)కు తీవ్రగాయాలయ్యాయి. సల్గాజ్ హురికి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన నవేద్ అక్తర్ ను టాటా మెయిన్ ఆస్పత్రికి తరలించామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎంకే సింగ్ తెలిపారు. గూడ్స్ రైలు హల్దియా వెళ్లాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

1679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles