టీడీపీని జనం పరుగెత్తించే రోజు దగ్గర్లోనే ఉంది!

Fri,April 19, 2019 05:34 PM

Botsa Satyanarayana Press Meet

విజయవాడ: ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు 18 జీవోలు జారీ చేశారని వైఎస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కోడ్‌ అమల్లో ఉంటే చంద్రబాబు సమీక్షలు ఎలా చేస్తారని మండిపడ్డారు. కొన్ని రోజుల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోంది. టీడీపీ శకం అంతమైంది. ఏపీలో జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని బాబు కోల్పోయారు. ఏ విషయంలో చూసినా మోసం, దగానే. టీడీపీని జనం పరుగెత్తించే రోజు దగ్గర్లోనే ఉంది. చంద్రబాబుకు పదవీ వ్యామోహం పోలేదు. చంద్రబాబు ఇంకా అధికార భ్రమలోనే ఉన్నారు. వ్యవస్థలన్నీ తన చెప్పు చేతల్లో ఉండాలని అనుకుంటున్నారు. ఆఖరికి ఎన్నికల సంఘం కూడా తన చెప్పు చేతల్లో ఉండాలంటారు. కోడ్‌ అమల్లో ఉన్నా అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు అవినీతి కార్యక్రమాలను చక్కబెట్టే పనిలో ఉన్నారు. పాత బకాయిల కోసమే చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. వ్యవస్థలకు అతీతుడన్నట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని బొత్స మండిపడ్డారు.

4290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles