బెంగాల్‌లో 70 విదేశీ పక్షులు స్వాధీనం

Fri,June 14, 2019 01:03 PM

Border Security Force Seizes Foreign Birds In Bengal North 24 Parganas

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని నార్త్‌ 24 పరగణ జిల్లాలో బీఎస్‌ఎఫ్‌ బలగాలు 70 విదేశీ పక్షులను స్వాధీనం చేసుకున్నాయి. గురువారం బంగ్లాదేశ్‌ నుంచి బెంగాల్‌కు పక్షులను స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు బీఎస్‌ఎఫ్‌ బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో బోర్డర్‌లో బలగాలు అప్రమత్తమై పక్షులను ఇండియాకు తీసుకువస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లో విక్రయించేందుకు తీసుకువచ్చిన 70 పక్షులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రెండు దేశాల సరిహద్దులోని పెట్రాపోల్‌ చెక్‌పాయింట్‌ వద్ద ఉన్న కస్టమ్స్‌ అధికారులకు పక్షులను అప్పగించారు బీఎస్‌ఎఫ్‌ అధికారులు. పెట్రాపోల్‌ భారత సరిహద్దులో ఉంటుంది.

986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles