హ‌జీ అలీ ద‌ర్గాలోకి మ‌హిళ‌లు వెళ్లొచ్చు..

Fri,August 26, 2016 11:51 AM

Bombay HC allows womens entry into inner area of Haji Ali dargah

ముంబై : ముంబై హైకోర్టు ఇవాళ సంచ‌ల‌న తీర్పును వెలువరించింది. హజీ అలీ ద‌ర్గాలోని గ‌ర్భాల‌యానికి మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశాన్ని క‌ల్పిస్తూ కోర్టు తీర్పును వెల్ల‌డించింది. పురుషుల‌తో పాటు మ‌హిళ‌ల‌కు కూడా ద‌ర్గాలోకి ప్ర‌వేశం క‌ల్పించాల‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కూడా కోర్టు ఆదేశించింది. ద‌ర్గాలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశంపై నిషేధం విధించ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది.

భార‌తీయ ముస్లిమ్ మ‌హిళా ఆందోళ‌న్ ఎన్జీవోకు చెందిన నూర్జాహ్‌, జాకియా సోమ‌న్‌లు ఈ కేసులో పిల్ వేశారు. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును జాకియా స్వాగ‌తించారు. ఖురాన్, రాజ్యాంగం ప్ర‌కారం మా హ‌క్కులు మాకు వ‌చ్చాయ‌ని జాకియా అన్నారు. 2012కు పూర్వం కూడా ద‌ర్గాలోకి మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం క‌ల్పించేవాళ్లు అని పిటీష‌న‌ర్లు కోర్టు ముందు వాదించారు. ద‌ర్గా గ‌ర్భాల‌యంలోకి మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం క‌ల్పించ‌రాద‌ని హ‌జీ అలీ ట్ర‌స్టు 2012లో ఆదేశాలు జారీ చేసింది.

ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు చ‌రిత్రాత్మ‌క‌మైన‌ద‌ని, హైకోర్ట ఆదేశాల‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని, ఇది మ‌హిళ‌ల‌కు అతి పెద్ద విజ‌య‌మ‌ని తృప్తీ దేశాయ్ అన్నారు. ద‌ర్గాలోకి మ‌హిళ‌ల ఎంట్రీపై నిషేధం విధించ‌డం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని హైకోర్టు పేర్కొన్న‌ట్లు కేసును వాదించిన న్యాయ‌వాది రాజు మోర్ తెలిపారు. అయితే హైకోర్టు వెల్ల‌డించిన తీర్పు ప‌ట్ల తాము సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు ద‌ర్గా ట్ర‌స్టు కూడా పేర్కొంది.

1674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles