విమానంలో ఆరు నెలల గర్భస్థ పిండం

Thu,July 26, 2018 12:16 PM

Body of Newborn Found in AirAsia Flight Toilet

న్యూఢిల్లీ : ఇది హృదయ విదారక సంఘటన.. ఓ తల్లి నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చింది. ఆరు నెలల గర్భస్థ పిండం విమానం టాయిలెట్‌లో పడి ఉండటాన్ని చూసి.. విమాన సిబ్బంది షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన ఎయిర్ ఏషియా విమానంలో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి గుహవాటి మీదుగా ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానం బయల్దేరింది. అయితే విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యే కంటే ముందు.. సిబ్బంది టాయిలెట్లను తనిఖీ చేశారు.

ఓ టాయిలెట్‌లో నెలలు నిండని పిండం పడి ఉండటాన్ని చూసి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. ఆ పిండాన్ని టిష్యూ పేపర్‌లో చుట్టి ఉంచినట్లు సిబ్బంది తెలిపారు. మొత్తానికి విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. పోలీసులు విమానంలోని మహిళలు అందరినీ విచారించగా.. ఓ 19 ఏళ్ల యువతి.. డెలీవరి అయినట్లు గుర్తించారు. ఈ యువతి దక్షిణ కొరియాలో తైక్వాండో టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు తన కోచ్‌తో గుహవాటి నుంచి బయల్దేరినట్లు పోలీసులు తెలిపారు. అయితే విమానం ఎక్కే ముందు తాను గర్భంతో ఉన్నట్లు డాక్యుమెంట్‌లో యువతి పేర్కొనలేదని కోచ్ తెలిపాడు. యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

3525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles